గోవిందపల్లెలో ముగిసిన క్రికెట్ పండగ.. విజేతలకు రవిచంద్రా రెడ్డి సత్కారం!
By |
May 22, 2026
శిరివెళ్ల(B10వార్త) మే 23:నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం గోవిందపల్లెలో గత కొన్ని రోజులుగా క్రీడాభిమానులను అలరించిన 'గోవిందపల్లె ప్రీమియర్ క్రికెట్ లీగ్' అట్టహాసంగా ముగిసింది. స్థానిక యువత ఆధ్వర్యంలో గోవిందపల్లె స్కూల్ గ్రౌండ్ వేదికగా, టెన్నిస్ బాల్‌తో 10 ఓవర్ల నాకౌట్ పద్ధతిలో ఈ టోర్నమెంట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు,ప్రారంభోత్సవం రోజున స్థానిక టీడీపీ నేత గంగదాసరి రవిచంద్రా రెడ్డి లాంఛనంగా ప్రారంభించిన ఈ టోర్నీలో.. ఏకంగా 53 జట్లు పాల్గొని హోరాహోరీగా తలపడ్డాయి. మొదటి మ్యాచ్ నుంచి ఫైనల్ వరకు ప్రతి మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది,ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌ను సైతం ముఖ్యఅతిథిగా విచ్చేసిన టీడీపీ నేత గంగదాసరి రవిచంద్రా రెడ్డి పిచ్‌పై టాస్ వేసి ప్రారంభించి, క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ మెగా టోర్నీ ఫైనల్ పోరులో అద్భుత ప్రదర్శన కనబరిచిన 'గోవిందపల్లె జూనియర్స్' జట్టు సత్తా చాటి విజేతగా నిలిచి ఛాంపియన్‌గా అవతరించింది. మ్యాచ్ అనంతరం క్రీడాకారుల కోలాహలం మధ్య బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది,టోర్నీలో గెలుపొందిన విజేతలకు గంగదాసరి రవిచంద్రా రెడ్డి తన చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రతిభ కనబరిచిన 'గోవిందపల్లె జూనియర్స్' జట్టుకు ప్రథమ బహుమతి కింద రూ. 50 వేల నగదుతో పాటు ప్రతిష్టాత్మక విన్నింగ్ ట్రోఫీని ఆయన అందజేశారు. అలాగే, ఫైనల్స్‌లో గట్టి పోటీ ఇచ్చి రన్నరప్‌గా నిలిచిన 'RCC' జట్టుకు ద్వితీయ బహుమతి కింద రూ. 25 వేలు, మెరుగైన ఆటతీరుతో ఆకట్టుకుని మూడవ స్థానంలో నిలిచిన 'Fr 11s' జట్టుకు తృతీయ బహుమతి కింద రూ. 10 వేల నగదును బహుకరించారు,గ్రామీణ స్థాయిలో ఇంతటి భారీ టోర్నమెంట్‌ను ఎలాంటి వివాదాలకు తావులేకుండా, పక్కా నిబంధనలతో, గొప్ప క్రీడా స్ఫూర్తితో విజయవంతంగా నిర్వహించిన స్థానిక యువతను, నిర్వాహక కమిటీని ముఖ్యఅతిథి రవిచంద్రా రెడ్డితో పాటు గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ టోర్నీ ద్వారా ఎంతో మంది యువ క్రీడాకారుల ప్రతిభ వెలుగులోకి వచ్చిందని స్థానిక క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.....Please subscribe B10news👈👈👈👈👈👈
Comments